కామారెడ్డి: ఎల్లారెడ్డి కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. పూజ అనంతరం, పాల్గొన్న వారందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.