TG: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జెడ్పీ స్థానం జనరల్, ఎస్సీ రిజర్వ్ అయితే జెడ్పీటీసీగా తానే పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఎంతవరకైనా పోరాడుతా అని వెల్లడించారు. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి అధిక సంఖ్యలో సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.