RR: సరూర్నగర్ డివిజన్లోని హుడాకాలనీ (టైప్ A,B,C)ని జీహెచ్ఎంసీ డీసీ శ్రీనివాస్, శానిటేషన్ డీఈ చందన, సంబంధిత శాఖ అధికారులతో కలిసి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సందర్శించారు. పార్కుల అభివృద్ధి, నిర్వహణ, శానిటేషన్ కార్యకలాపాల వంటి సమస్యలను పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. సమస్యలకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.