GNTR: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరుగుతుందని, పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.