JGL: అర్బన్ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు జగిత్యాల డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీలత తెలిపారు. అర్హులైన SHGల రుణ దరఖాస్తులను ఈ నెల 24లోపు పంపాలని సూచించారు. PM వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.