BDK: భద్రాచలం పట్టణంలో సీపీఐ డివిజన్ కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య పట్టణ ముఖ్య కార్యకర్తలు ఇవాళ సమావేశమయ్యారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాధన పల్లి సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. భద్రాచలం పట్టణంలో విచ్చలవిడిగా పట్టణ శివారు కాలనీలలో గంజాయి తాగుతున్న బ్యాచ్లు ఎక్కువయ్యాయని, అదే విధంగా గంజాయి అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.