JGL: రైతులు యూరియా బుకింగ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, రాయికల్ మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ పేర్కొన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్, ఇటిక్యాల, భూపతిపూర్, ధర్మాజీపేట గ్రామంలో రైతులకు యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ యాప్ వలన రైతులు యూరియాను సులభంగా, పారదర్శకంగా, క్యూలైన్ల ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చని పేర్కొన్నారు.