నెల్లూరు నగరపాలక సంస్థ ఇంఛార్జ్ మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో కమిషనర్‌తో పాటు అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పలు విభాగాలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.