అన్నమయ్య: శ్రీనివాస రామానుజన్ జయంతి, గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పీలేరులోని SG ప్రభుత్వ డిగ్రి కళాశాలలో గణితశాస్త్ర అధిపతి యర్రయ్య ఆధ్వర్యంలో రామానుజ, ఆర్యభట్ట, భాస్కరాచార్య గ్రూపులుగా విద్యార్థులను విభజించి క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ యస్.సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ పోటీలలో భాస్కరాచార్య గ్రూప్ విజేతగా నిలిచింది.