KMM: పదవి ఒక వరమని నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల మన్నలను పొందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి(మం) పాకలగూడెం వ్యవసాయ క్షేత్రంలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను మంత్రి తుమ్మల ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఎలాంటి నిధులు కావాలన్నా సహాయ సహకారాలు అందిస్తానన్నారు.