NLR: వ్యవసాయానికి నీరే ప్రాణాధారమని ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లు చేరాలంటే సాగునీటి కాలువలు బాగుండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరం మాగుంట లేఔట్‌లోని ఆమె నివాసంలో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘ అధ్యక్షులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.