బాగా ఆడుతున్నప్పటికీ భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డానని ఇషాన్ కిషన్ అన్నాడు. జార్ఖండ్‌కు తొలి SMAT టైటిల్ అందించిన అనంతరం మాట్లాడుతూ.. ‘ఇలా ఆడినా తీసుకోలేదంటే ఇంకా గొప్పగా రాణించాలని అర్థమైంది. నా జట్టును గెలిపించాలి అనుకున్నా’ అని పేర్కొన్నాడు. టీమిండియాలో పేరు లేదని బాధపడేలా లేనని, అంచనాల్లేకుండా ఆడటమే తన పని అని తెలిపాడు.