TG: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు బాధ్యత తీసుకోవాలన్నారు. సివిల్ సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగటం మంచి పరిణామమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ల నుంచి నియామకాల వరకు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.