MBNR: బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచులను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం సన్మానించారు. కాంగ్రెస్ అభ్యర్థులు అధిక మెజార్టీతో విజయం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.