KNR: చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో అంగన్వాడి సెంటర్, ఉన్నత పాఠశాలలో “బాల్య వివాహ్ ముక్త్ భారత్”పై గురువారం అవగాహన కల్పించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 పై అర్హత వయసుపై పిల్లలకి అవగాహన నిర్వహించారు. మానవ హారం, బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ చేయించారు. మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్టులు పాల్గొన్నారు.