PPM: కురుపాం మండలంలో సీతంపేట పరిసర గ్రామాల్లో చెరుకు, అరటి తోటల్లో శుక్రవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏనుగులు పంట పొలాల వైపు కదులుతున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామస్థులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.