కృష్ణా: మచిలీపట్నంలో రుద్రాక్ష మాల దొంగలించిన కేసులో ముద్దాయిలు జోగి, శ్రీనాథ్లను సీఐ ఏసుబాబు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి రుద్రాక్ష మాలను తీసుకొని, కేసు నమోదు చేశారు.అనంతరం ముద్దాయిలను కోర్టు ముందు హాజరపరిచగా, కోర్టు ముందాయులకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ ఏసుబాబు హెచ్చరించారు.