SDPT: యూరియా బుకింగ్‌కు సంబంధించిన కొత్త యాప్‌పై వ్యవసాయ శాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీలర్లు, ఏఈఓలకు శిక్షణ ఇచ్చింది. బెజ్జంకి రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో యాప్ వినియోగంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేసి సందేహాలను నివృత్తి చేశారు. ఈ నెల 20 నుంచి యాప్‌ను అమల్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ తెలిపారు.