SRCL: చందుర్తి మండలం మూడపల్లి, నర్సింగాపూర్, మర్రిగడ్డ గ్రామాల నుంచి కలప అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఆయా గ్రామాల్లోని వేప, చింత, మామిడి చెట్లను నరికివేస్తున్నారు. అక్రమ కలప వ్యాపారులు అటవీ శాఖ అధికారుల నుంచి ఒక చెట్టుకు అనుమతి తీసుకుని అదనంగా చెట్లను నరికి వేస్తున్నారు. నరికిన చెట్లను దుంగలుగా చేస్తూ వేములవాడ, సిరిసిల్ల తరలిస్తున్నారు.