TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన BRS అభ్యర్థులకు మాజీ మంత్రి KTR అభినందనలు తెలిపారు. BRS అధికారం కోల్పోయిన రెండేళ్లల్లోనే మళ్లీ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అభినందన కార్యక్రమంలో పాల్గొన్న KTR.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఎంపీగా గెలవటం కంటే సర్పంచ్‌గా గెలవటం కష్టమని KTR వ్యాఖ్యానించారు.