SKLM: భారత ప్రభుత్వ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిరీష తన కార్యాలయంలో గురువారం పలాసకు చెందిన పలు గ్రామాల యువజన సంఘాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రంథాలయ ఛైర్మన్ విఠల్, డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల పాల్గొన్నారు.