ఖమ్మం జిల్లాకు ప్రభుత్వం అడిగినవన్నీ నిధులు ఇస్తుందని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ నగరంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కబ్జా చేసే వాళ్ళని, గొడవలు చేసే వాళ్ళని, గంజాయి బ్యాచ్లను ఖమ్మంకు దూరం చేయమని ప్రజలు అడిగినట్లు తెలిపారు. ఖమ్మంలో గంజాయి, కబ్జాలు లేకుండా చేస్తానని వారికీ మాట ఇచ్చానని అన్నారు.