ప్రకాశం: మార్కాపురం జిల్లాగా ప్రకటించడంతో సీఎం చంద్రబాబుకు ఎంతో రుణపడి ఉంటామని తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ కృతజ్ఞత సభ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు, ఎమ్మెల్యే కందుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత వైసీపీ జిల్లాల పునర్విభజన సమయంలో ఎంతో వివక్ష చూపారని పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంఛార్జ్ కందుల రామిరెడ్డి మండిపడ్డారు.