ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని టీడీపీ అధిష్ఠానం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చంటి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.