WNP: గోపాల్ పేట మండల కేంద్రంలోని రంగస్వామి మద్యం దుకాణం వెనుక ఉన్న పొలంలో గురువారం ఓ మహిళ మృతదేహం బయటపడింది. కౌలు రైతు వరి సాగు కోసం పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతుండగా శవం బయటకు రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఏదుల గ్రామానికి చెందిన బోయ బాలమ్మగా గుర్తించారు.