BHPL: మూడో విడత GP ఎన్నికల్లో పెద్దతూండ్ల గ్రామంలోని 5వ వార్డులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అభ్యర్థులు కందుగుల సమ్మక్క, నక్క జ్యోతి, మంత్రి పద్మలు పోటీలో ఉండగా.. 216 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కందుగుల సమ్మక్క, నక్క జ్యోతికి సమానంగా 79 ఓట్లు రావడంతో డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో కందుగుల సమ్మక్క విజేతగా నిలిచి వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.