TPT: శ్రీకాళహస్తి మండలం ఆదవరం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించి 6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి పారిపోతున్న కర్నాటక వాసి నిందితుడిని పట్టుకుని, అతని ద్విచక్ర వాహనంతో పాటు దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ స్టేషన్కు తరలించారు. SI రఫీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.