TG: KTR కాంగ్రెస్ గురించి కాకుండా హరీష్ రావు గురించి ఆలోచిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను తప్పించాలని హరీష్ రావు వర్గం ఇప్పటికే ప్రచారం చేస్తోందన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని మార్చాలని హరీష్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.