ప్రకాశం: పుల్లలచెరువులోని పలు హాస్టల్ భవనాలను ఇవాళ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్లో వసతులు, మౌలిక సదుపాయాలను ఆరా తీశారు. విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేసి, త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.