WGL: ఖిలా వరంగల్ మండలం మధ్య కోటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లిన ఆమె విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, సబ్జెక్టు పరమైన ప్రశ్నలు అడిగారు. పిల్లల సమాధానాలకు ముగ్ధురాలై వారితో కలిసి ఫొటోలు దిగారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.