NGKL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే HPU వ్యాక్సిన్ సామర్థ్యం పూర్తిగా కోల్డ్ చైన్ నిర్వహణపై ఆధారపడి ఉంటుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.రవికుమార్ నాయక్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫార్మసీ ఆఫీసర్లు, కోల్డ్ చైన్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. రోజుకు రెండుసార్లు ఉష్ణోగ్రతలు నమోదు చేయాలని సూచించారు.