ADB: నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం తెలియజేశారు. గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో భాగంగా బోథ్, బజార్హత్నూర్ మండలాలలో 11 కేసులను నమోదు అయినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉందని అనుమతులు లేనిదే ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని పేర్కొన్నారు.