WG: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందని CPM జిల్లా కార్యదర్శి గోపాలన్ మండిపడ్డారు. ఆకివీడులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదల పొట్ట కొట్టేలా బడ్జెట్లో కోతలు విధించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించాలని, పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.