TG: పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిషత్ ఎన్నికల నిర్వహణలో తొందరలోనే అసెంబ్లీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.