AP: కలెక్టర్లు పోటీపడి పనిచేసేలా సదస్సులో చర్చలు జరిగాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లాలు సాధించిన ప్రగతిని కలెక్టర్లు వివరించారని చెప్పారు. స్వర్ణాంధ్ర దిశగా సీఎం చంద్రబాబు సూచించిన 10 సూత్రాలపై చర్చించారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చిన్నారుల చదువు, వసతి గురించి చర్చించామని వివరించారు.