సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 21న జాతీయ మెగా లోక్-అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీ మార్గమే.. రాజ మార్గమని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.