వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. టెలికాలర్స్, సేల్స్, రిటైల్, మార్కెటింగ్ తదితర రంగాల్లో సుమారు 70 ప్రైవేటు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు గల ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని మల్లయ్య సూచించారు.