NGKL: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామిని నూతన సర్పంచ్ రషీద్, ఉపసర్పంచ్ రేపాని శ్రీనివాసులు, ఆలయ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి గురువారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ టెండర్ల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, నాగోజీ, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.