KRNL: జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 19న ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హైస్కూల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ. 5 వేల వరకు బహుమతులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.