AP: అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీనియర్ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.