VZM: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 4.45 వీటీ.అగ్రహరంలోని వై జంక్షను దగ్గర గల సీఎంఆర్ లే ఆవుట్ చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గోంటారు. అనంతరం సాయంత్రం 6గంటలకు బయలుదేరి రాత్రి 7.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు.