BHNG: ప్రమాదవశాత్తు కారు పల్టీకొట్టిన ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలైన సంఘటన వలిగొండ మండలంలోని చిత్తాపురం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన కథనం ప్రకారం.. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బిక్షపతి కారులో HYD కు వెళుతున్న క్రమంలో చిత్తాపురం స్టేజీ సమీపంలో ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిందని తెలిపారు.