SKLM: గ్రామీణ (M) మునసబు పేటలోని గురజాడ విద్యాసంస్థలో శుక్రవారం జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈవో ఎ.రవి బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉ.9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన శత శాతం ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చేలా HMలు చర్యలు చేపట్టాలని కోరారు.