నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని పి. అంబిక జాతీయ స్థాయి రన్నింగ్ పోటీలకు ఎంపికైంది. వరంగల్లో జరిగిన రాష్ట్ర స్థాయి 1,500 మీటర్ల పరుగు పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. ఏప్రిల్లో జరిగే జాతీయ పోటీల్లో ఆమె పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ తెలిపారు.