NRPT: జిల్లాలోని 272 పంచాయతీల్లో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా సర్పంచులు లేక, ప్రత్యేక అధికారుల పాలనలో పనులు పూర్తిస్థాయిలో సాగక గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రధానంగా పారిశుధ్యం, రహదారులు, మురుగుకాలువల నిర్మాణం వంటి పనులు నిలిచిపోయాయి. సర్పంచులు ఇప్పటికైనా గ్రామాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.