KMR: తలసేమియా చిన్నారుల ప్రాణదాతగా నిలుస్తున్న కామారెడ్డికి చెందిన డాక్టర్ బాలుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్తగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. తలసేమియా బాధితుల కోసం సుమారు 5,000 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ గౌరవం దక్కింది.