హీరోయిన్ నిధి అగర్వాల్పైకి అభిమానులు దూసుకెళ్లి సెల్ఫీల కోసం ఎగబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘వీళ్లు మగాళ్లు కాదు.. జంతువులు. వాటి కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాళ్లను వేరే గ్రహానికి పంపాలి’ అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.