‘అవతార్ 3’ మూవీపై దర్శకుడు సుకుమార్ రివ్యూ ఇచ్చాడు. ‘సినిమా అద్భుతంగా ఉంది. 3:17 గంటలు నాకు క్షణాల్లో అయిపోయాయి. చుట్టూ అన్ని మరిచిపోయి పండోర ప్రపంచానికి వెళ్లిపోయాను. తెలుగు సినిమాల్లో ఉన్న అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి. ఆ విజువల్స్, పాత్రలు నా మైండ్లో నుంచి వెళ్లట్లేదు. మూవీ అంటే ఇది అనిపించింది. జేమ్స్ కామెరూన్ మూవీలను మనం థియేటర్లలో చూస్తేనే ఎంజాయ్ చేయగలం’ అని తెలిపాడు.