VZM: విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో గురువారం టీడీపీ కార్యాలయంలో మినీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేయించి పంచారు. ఈ సందర్భంగా ఆమె అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.