RR: షాద్నగర్ పట్టణంలోని కళాశాల విద్యార్థులకు RJNRలోని ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ప్రాక్టికల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీలో జరుగుతున్న వివిధ వ్యవసాయ ప్రయోగాలు, పంటల అభివృద్ధి విధానాలు, ఆధునిక సాగు పద్ధతులను విద్యార్థులు పరిశీలించారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు వ్యవసాయ రంగంపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులన్నారు.